ఆ మూడు రాష్ట్రాలే ఆదర్శం

17 Jul, 2016 16:31 IST|Sakshi

మద్యాన్ని నిషేధించాలంటూ జాతీయ మహిళా సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడింది. వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం హిమాయత్‌నగర్ వై జంక్షన్‌లో ప్రభుత్వ దిష్టిబ్మొను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్.రాధిక, యాదమ్మ, కె.ధర్మెంద్ర, నెర్లకంటి శ్రీకాంత్, టి.సత్యప్రసాద్‌లు మాట్లాడుతూ మద్యం ద్వారానే రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తోందని ప్రభుత్వమే ప్రకటించడం సిగ్గుచేటన్నారు. బిహార్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు విశాల్, సతీష్, చైతన్య యాదవ్, లక్ష్మణ్, సాయినాధ్ తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు