‘ఫేస్’ మారింది!

18 Jan, 2016 01:02 IST|Sakshi
‘ఫేస్’ మారింది!

ఫేస్‌బుక్‌లో కొత్త అకౌంట్లు
తాజా వివరాలతో అప్‌డేట్లు
ఇదీ పార్టీలు మారుతున్న నాయకుల తీరు

 
సుల్తాన్‌బజార్: నిత్యం ఫేస్‌బుక్ ద్వారా అందరికీ ‘టచ్’లో ఉంటున్న రాజకీయ నాయకులు పార్టీలు మారడమే కాదు...ఫేస్‌బుక్‌లో పాత అకౌంట్‌లకు స్వస్తి చెప్పి.. కొత్తవి తెరుస్తున్నారు. పార్టీలోని నాయకులు.. ప్రజలు... మీడియాకు తాజాగా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. కొత్త పార్టీల కండువాలతో పాటు... సంబంధిత నేతలతో కలసి నూతనంగా దిగిన ఫొటోలనూ పెడుతున్నారు. వాట్సాప్‌లోనూ ఇలాగే వివరాలు మారిపోతున్నాయి. ఈ రిక్వెస్ట్‌లు చూస్తున్న ‘ఫ్రెండ్స్’ అవాక్కవుతున్నారు.
 
కొత్త అజెండా

 కొత్తగా ఫేస్‌బుక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్న నాయకులు తమ బయోడేటాలతో పాటు పార్టీ జెండాలనూ...అజెండాలనూ అప్‌లోడ్ చేస్తున్నారు. తాము చేపట్టబోయే అభివృద్ధి పనులనూ అజెండాలో చూపిస్తున్నారు.
 
ఒక్క రోజులోనే మార్పు

 గోషామహల్ నియోజకవర్గంలో రాజకీయ నాయకుల తీరు చూసి విస్తుపోవడం ఓటర్ల వంతవుతోంది. సంక్రాంతి పండుగకు పచ్చ పార్టీలో ఉన్న ఓ కీలక నాయకుడు... తనకు టికెట్ రాదని తెలియడంతో...వెంటనే పార్టీతో పాటు డివిజన్‌నూ మార్చేశాడు. పండగకు ముందు రోజు వరకూ పచ్చ పార్టీలో ఉన్న ఆ నాయకుడు మరుసటి రోజు గులాబీ కండువాతో ప్రత్యక్షమయ్యాడు. దీంతో స్థానికులు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.  
 
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా