రెండో రోజూ సందడిగా ట్రావెల్ మీట్

23 Feb, 2014 00:53 IST|Sakshi

సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి : రాష్ట్రంలోనే తొలిసారి నిర్వహిస్తున్న హైదరాబాద్ ట్రావెల్‌మీట్ రెండవరోజూ సందడిగా కొనసాగింది. బేగంపేట పర్యాటకభవన్‌లో నిర్వహిస్తున్న ఈ మీట్‌లో భాగంగా ఉదయం హెరిటేజ్ టూరిజం ప్రమోషన్-బాటిల్‌నెక్, సొల్యూషన్స్ అనే అంశంపై పర్యాటక రంగ ప్రముఖులు ఎస్.కె.మిశ్రా, జి.కిషన్‌రావు, నరేంద్రలూథర్, వినోద్ డేనియల్ తదితరులు మాట్లాడారు.

రెండో సెషన్లో లగ్జరీ, లీజర్, లైఫ్‌స్టైల్ టూరిజం అనే అంశంపై సుభాష్ గోయల్, గిరీష్ సెహగల్, అకేష్ భట్నాగర్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ల ప్రదర్శనను ప్రారంభించారు. మధ్యాహ్నం సెషన్లలో పాకశాస్త్ర ప్రావీణ్యం-స్థానిక ఆహారం అనే అంశంపై సంబంధిత రంగ ప్రముఖులు బి.ఆర్.రావు, చలపతిరావులతో పాటుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆలమ్‌లు మాట్లాడారు.

అనంతరం సినిమా పర్యాటకం, స్థానిక ప్రాంతాల అభివృధ్ధి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దీనిలో సినిమా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డీవోటీ జాయింట్‌డెరైక్టర్ బాలసుబ్రమణ్యారెడ్డి, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జీఎన్‌రావులు పాల్గొని మాట్లాడారు.
 

>
మరిన్ని వార్తలు