క్రికెట్ బాల్ తగిలి మహిళ మృతి

4 Jan, 2016 22:27 IST|Sakshi

బహదూర్‌పురా (హైదరాబాద్): క్రికెట్ బాల్ తగిలి ఓ మహిళ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలాపత్తర్ బిలాల్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎంఏ ఖయ్యూం కూతురు సబాన్ తస్లీమీన్ (31) గత నెల 26న మధ్యాహ్నం టెర్రాస్ పైకి వెళ్లింది. ఆ సమయంలో కింద కొందరు క్రికెట్ ఆడుతున్నారు.

ఆటగాడు కొట్టిన బంతి టైరాస్‌పై ఉన్న తస్లీమీన్‌కు తగలింది. దీంతో ఆమె గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా నిమ్స్‌కు పంపించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తస్లీమీన్ సోమవారం ఉదయం మృతి చెందింది. తస్లీమీన్ సోదరుడు మహ్మద్ డ్యానీస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు