రెచ్చిపోతున్న ఆర్మీ జవాన్లు

5 Nov, 2013 04:11 IST|Sakshi

 

=రెచ్చిపోతున్న ఆర్మీ జవాన్లు
 =పలువురిపై దాడులతో హంగామా
 =బాలికపై లైంగికదాడికి యత్నంతో సంచలనం
 =మానసిక ఒత్తిడీ ఓ కారణమే!

 
 సాక్షి, సిటీబ్యూరో: దేశ సరిహద్దుల్ని కంటికి రెప్పలా కాపాడే మిలటరీ అది.. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ప్రాణాలను పణంగా పెట్టి బాధితుల్ని రక్షించే జవాన్లు వారు.. ఇలాంటి రక్షణ బలగాల్లోనూ రాక్షసులు ఉంటున్నారు. గతంలో అమాయకు లు, పోలీసులపై దాడులతో సిటీలో హల్‌చల్ చేశారు. ఇప్పుడు ఏకంగా బాలికపై సామూహి క లైంగికదాడికి యత్నించి కటకటాల్లోకి చేరా రు. తుకారామ్‌గేట్ ఠాణా పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనం సృష్టించింది.
 
 ఇతర ప్రాంతాల కంటే సిటీ బెటర్...
 
 రక్షణ బలగాలకు సంబంధించి నగరంలో ఉన్న కేంద్రాల్లో సికింద్రాబాద్‌లో ఏఓసీ సెంటర్ ఒక టి. సరిహద్దులతో పాటు ఇతర సమస్యాత్మక, కీలక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడంతో పో లిస్తే ఇక్కడ పని చేయడాన్ని బెటర్ పోస్టింగ్‌గా నే సిబ్బంది భావిస్తారు. ఈ నేపథ్యంలో సిటీలో పోస్టింగ్ కోసం తీవ్ర పోటీ ఉంటుంది. ఇలాం టి చోట పనిచేస్తున్న ఆర్మీ జవాన్లలోనూ కొంద రు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నారు. ఇందుకు కార ణం వారిలో అంతర్లీనంగా ఉన్న యాంటీ సోష ల్ పర్సనాలిటీ అయి ఉండొచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 
 ఇక్కడా ప్రతికూల పరిస్థితులెన్నో...


 ఆర్మీ వంటి రక్షణ బలగాల్లో పని చేస్తున్న వారి లో కొందరు తప్పు చేసినంత మాత్రాన అందరినీ ఒకే గాటనకట్టలేమని మానసిక నిపుణులు చెప్తున్నారు. జవాన్లూ అనేక ప్రతికూల పరిస్థితు లు ఎదుర్కొంటున్నారని ఓ రిటైర్డ్ ఆర్మీ అధికా రి వ్యాఖ్యానించారు. చాలీచాలని జీతం నేపథ్యంలో పలువురు తమ కుటుంబాలను స్వరాష్ట్రం, సొంత ప్రాంతాల్లోనే వదిలేసి వస్తున్నారు. దీంతోపాటు పని వేళలు, ఉన్నతాధికారుల ప్రవర్తన తదితరాలూ సిబ్బందిపై ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. ఇటీవల పుణేలోని ఆర్డ్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (ఏఎఫ్‌ఎంసీ)లో జరిగిన సదస్సులో వక్తలు, మేధావులు, నిపుణులు నివేదించిన దాని ప్రకారం ఆర్మీలో పని చేస్తున్న వారు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంటున్నారని తేలిందని అంటున్నారు.
 
 కోర్ట్ మార్షల్ ‘ధైర్యమే’ కారణమా?


 ఆర్మీ వంటి రక్షణ సంస్థల ప్రాధాన్యత, అందులోని ఉద్యోగులకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యం లో వారికి ప్రత్యేక చట్టం, విచారణ పద్ధతులు ఉన్నాయి. వీటిలో కోర్ట్ మార్షల్ ఒకటి. ఆరోపణలు ఎదుర్కొంటున్న రక్షణ బలగాల ఉద్యోగు ల్ని శాఖాపరంగా ఇందులో విచారిస్తారు. అం దుకు సాధారణ నేరాలు, కొన్ని ఉదంతాల్లో ఆర్మీకి చెందిన ఉద్యోగులపై సాధారణ పోలీసు లు కేసుల నమోదు, చర్యలు తీసుకోవడం జరగదు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి కేవలం కోర్ట్ మార్షల్ మాత్రమే చేయాలి. ఇం దులో బయట చేసిన నేరాలు నిరూపణ కావనే ఉద్దేశంతోనూ కొందరు జవాన్లు బరితెగిస్తున్నారని నిపుణులు అంటున్నారు.
 
 జవాన్ల దారుణాలివి...
 కిడ్నాప్ కేసు విషయమై గతంలో గోల్కొండ ఠాణాపై దాడిచేసిన ఆర్మీ జవాన్లు విధ్వం సం సృష్టించారు. పోలీసులపై దాడిచేశారు.
     
 సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్ సమీపంలో నిర్మించిన ప్రార్థన స్థలంపై వివాదం రేగి స్థానికులు, పోలీసులపైనా దాడి చేశారు.
     
 రెండేళ్ల క్రితం నాంపల్లి రైల్వేస్టేషన్‌లో స్వల్ప వివాదంతో ఆర్మీ ఉద్యోగులు, రైల్వే పోలీ సుల మధ్య ఘర్షణ జరిగింది. రెచ్చిపోయిన జవాన్లు రైల్వే పోలీసుస్టేషన్‌పై దాడిచేసి సిబ్బందిని చావబాదారు.
     
 ఆర్మీ స్థలంలోకి ప్రవేశించారని, ఇతరత్రా కారణాలతో తరచు నగరవాసులపై ఆర్మీ సిబ్బంది దాడులు చేస్తూనే ఉన్నారు.
 

మరిన్ని వార్తలు