పోలీసులపై దాడిచేసింది ఎల్లగౌడ్‌ గ్యాంగే

2 Aug, 2014 09:42 IST|Sakshi

హైదరాబాద్ :  శామీర్ పేటలో  పోలీసులపై కత్తులతో దాడి చేసిన దొంగల ముఠా సిద్దిపేట యల్లంగౌడ్ గ్యాంగ్గా పోలీసులు అనుమానిస్తున్నారు. మారుతీ స్విప్ట్ కారులో వచ్చిన అయిదుగురు సభ్యుల ముఠా గతరాత్రి శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ చౌరస్తా సమీపంలోని బావర్చి హోటల్ వద్ద పోలీసులపై దాడి చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేటలో ఈ గ్యాంగ్పై పలు కేసులు నమోదు అయ్యాయి. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో ఇద్దరు సభ్యుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా  సళంత్రి వాసి . మరోవైపు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డి మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ శనివారం ఉదయం ఎస్ఐని పరామర్శించారు. మరోవైపు ఈ దాడిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక దొంగ మృతిచెందాడు.
 

మరిన్ని వార్తలు