విజయీభవ..

2 Mar, 2016 07:20 IST|Sakshi
విజయీభవ..

నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
రేపు సెకండియర్ పరీక్షలు ఆరంభం
హెల్ప్‌లైన్ నంబర్లు  040 - 23236433, 23242696

 
సిటీబ్యూరో:  ఏడాదంతా చదివి...రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సిద్ధమైన ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. బుధవారం నుంచి ప్రారంభమవుతున్న పరీక్షలకు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో హాజరై.. అంతే ఉత్సాహంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కాగా ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి  బుధవారం జంట జిల్లాల్లో 1.79 లక్షల మంది ద్వితీయ భాష పరీక్షను తొలిగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో 189, రంగారెడ్డి జిల్లా పరిధిలో 244 కేంద్రాల్లో జరిగే పరీక్షల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను  పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు 8 గంటల లోపే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుంటే మేలు. 8.30 గంటలకు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. విద్యార్థులను సకాలంలో కేంద్రాల వద్దకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఆర్టీసీ సమాయత్తమైంది. ‘ఎగ్జామ్ స్పెషల్’ పేరిట బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు పూర్తి చే సింది. హాల్‌టికెట్, పెన్నులు కచ్చితంగా విద్యార్థులు తీసుకెళ్లాలి. డౌన్‌లోడ్ చేసిన హాల్‌టికెట్‌తోపాటు కళాశాల గుర్తింపు కార్డు తప్పనిసరికాదు. కాకపోతే వెంట ఉంటే మేలు. ఇక గురువారం మొదలయ్యే సెకండియర్ పరీక్షలకు 1.98 లక్షల మంది సన్నద్ధం అవుతున్నారు.

హెల్ప్‌లైన్ నంబర్లు: ఉదయం ఏడు గంటల నుంచే పనిచేస్తాయి. నిర్వహణలో ఎటువంటి  ఇబ్బందులు ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెంటనే సంప్రదింవచ్చు.
హైదరాబాద్ జిల్లా 040-23236433
రంగారెడ్డి జిల్లా: 040-23242696, 23244625  
 హైదరాబాద్ జిల్లా పరీక్షల కమిటీ సభ్యుల నంబర్లు: 9908215359, 9347201789, 9849557401, 9391012604, 9849524111
 

మరిన్ని వార్తలు