లయ తప్పుతోంది..!

29 Sep, 2015 00:31 IST|Sakshi
లయ తప్పుతోంది..!

{Vేటర్‌లో 36 శాతం మందికి హైబీపీ సమస్య
60 శాతం మందికి బీపీ ఉన్నట్లే తెలియదు
అధిక రక్తపోటు కారణంగానే హృద్రోగ సమస్యలు
కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడి
నేడు వరల్డ్ హార్ట్ డే..

 
భాగ్యనగరం హైబీపీకి కేంద్ర బిందువుగా మారుతోంది. నగరంలో 18-40 ఏళ్ల వయస్కుల్లో 36 శాతం మంది , గ్రామీణ ప్రాంతాల్లో 18-20 శాతం మంది అధిక రక్త పోటుతో బాధపడుతున్నట్లు తేలింది. నగరంలో ఏటా వెలుగు చూస్తున్న హృద్రోగ మరణాల్లో అత్యధిక శాతం హైబీపీ కారణంగానే జరుగుతున్నట్లు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా తాజా సర్వేలో వెల్లడైంది.  మంగళవారం ‘వరల్డ్ హార్డ్ డే’ సందర్భంగా హృద్రోగానికి కారణమవుతున్న హైబీపీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం!
 
సిటీబ్యూరో:   మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అతిగా మద్యం సేవించడం, దూమపానం, ఊబకాయం, పని ఒత్తిడి వెరసి గుండె పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా ‘బిగ్ బీపీ క్యాంపెయిన్’పేరుతో హెబీపీపై  ఎనిమిది గంటల పాటు సర్వే నిర్వహించి, 1.80 లక్షల మందిని పరీక్షించింది. ఇందులో భాగంగా నగరంలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మహాత్మా గాంధీ బస్టేషన్, ఐఎస్‌సదన్, జూబి్లిహ ల్స్ అపోలో, డీఆర్‌డీఓ అపోలో, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో 65 క్యాంప్‌ల ఏర్పాటు చేసింది. 19,846 మందిని పరీక్షించి, వీరిలో 11,245 శాంపిల్స్‌ను విశ్లేషించగా, బాధితుల్లో 36 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తించింది. 60 ఏళ్ల వారితో పోలిస్తే 18-40 ఏళ్లలోపు వారే మూడు రెట్లు ఎక్కువగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అయితే బాధితుల్లో 60 శాతం మందికి తమకు రక్తపోటు సమస్య ఉన్నట్లు కూడా తెలియకపోవడం గమనార్హం. మందులు వాడుతున్న 42 శాతం మందిలోనే బీపీ కంట్రోల్‌లో ఉండటం లేదు. ఇప్పటి నుంచే జాగ్రత్తపడక పోతే 2025 నాటికి జనాభాలో మూడు వంతుల మంది హైబీపీ భారిన పడే ప్రమాదం ఉందని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ కో ఆర్డినేటర్ డాక్టర్ శివకుమార్, డాక్టర్ వెంకట్ ఎస్ రామ్, డాక్టర్ రమేష్‌బాబు, డాక్టర్ నర్సరాజు పేర్కొన్నారు. ఈ మేరకు వారు సోమవారం తాజ్ దెక్కన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్వే వివరాలను వెల్లడించారు.

 ఐటీ అనుబంధ మహిళల్లోనూ...:
 ఇటీవల ఐటీ అనుబంధ రంగాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటు ఇంటి పనుల్లోనూ, అటు ఆఫీసు పనుల్లోనూ వారు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. జీవనశైలి వల్ల రుతుక్రమంలోనూ అనేక మారు ్పలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వంద మంది హృద్రోగ బాధితుల్లో 65 శాతం మంది పురుషులు ఉండగా, 35 శాతం మంది మిహ ళలు ఉంటున్నారు. పురుషులతో పోలిస్తే మహిళ ల్లోనే ఆకస్మిక మరణాల రేటు ఎక్కువ గా ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆకస్మిక మరణాలు 1.2 శాతం ఉండగా, గ్రేటర్‌లో 4.9 శాతం ఉన్నట్లు గుర్తించామన్నారు. మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ చూపక పోవ డం, వైద్య ఖర్చులకు వెనకాడటం, నొప్పి వచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకు వెళ్లడం కూడా ఇందుకు ఓ కారణమని వారు పేర్కొన్నారు.

అధిక ఉప్పు ఓ కారణం: డాక్టర్ శివ్‌కుమార్ జె, చీప్ కార్డియాలజిస్ట్, అపోలో, సికింద్రాబాద్తల్లిదండ్రులకు బీపీ ఉంటే వారి సంతానానికి కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది.ఆహారంలో తీసుకుంటున్న ఉప్పు కూడా ఓ ప్రధాన కారణం.  {పతి రోజు ఆహారంలో ఉప్పు 2 గ్రాములు తీసుకోవాలి.చాలా మంది 9-15 గ్రాములు తీసుకుంటున్నారు.మందు, మాంసం, పొగ, స్వీట్స్, ఐస్‌క్రీమ్, జంక్‌ఫుడ్డును తగ్గించాలి. తాజా పండ్లు, కాయకూరలు, ముడిబియ్యం, రాగులు, సజ్జలు తీసుకోవాలి. బీపీ 140/90 మించకుండా చూసుకోవాలిః శ్రీధర్ కస్తూరి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, సన్‌షైన్యువకులు రక్తపోటు 140/90 మించకుండా, వృద్దుల్లో 150/90 మించకుండా చూసుకోవాలి.పరగడుపున షుగర్‌లెవల్స్ 100 ఎంజీ, తిన్న తర్వాత 110-120 ఉండేలా చూసుకోవాలి.

{పతి రోజూ 45 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. పని చేసే చోట ఆరోగ్యకర వాతావరణ ం ఉండేలా చూసుకోవాలి.{పతి మూడు మాసాలకోసారి బీపీ చెక్ చేసుకోవాలి కలుషిత నీరు, గాలితోనే గుండె జబ్బులుః డాక్టర్ ప్రవీణ్ సక్సేనా
 
కలుషిత నీరు తాగడంతో పాటు కాలుష్యంతో కూడిన గాలిని పీల్చడం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని ప్రముఖ ఎన్విరాన్‌మెంట్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ సక్సేనా అన్నారు. వరల్డ్ హార్ట్ డేను  పురస్కరించుకుని సోమవారం బషీర్‌బాగ్‌లోని పోగ్రెసీవ్ మెడిసిన్ సెంటర్‌లో హృద్రోగులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నగరీకరణ వల్ల నీరు, గాలి కలుషితమై పోవడంతో వీటిలోని ప్రమాదకరమైన రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయన్నారు. హృద్రోగం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.  
 
 

మరిన్ని వార్తలు