నేడు కృష్ణా త్రిసభ్య కమిటీ భేటీ

31 May, 2017 03:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని నాగా ర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటి పంపకాలపై చర్చించేందుకు కృష్ణా నది బోర్డు త్రిసభ్య కమిటీ బుధ వారం భేటీ కానుంది. జలసౌధలో జరిగే ఈ భేటీకి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీతో పాటు ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు హాజరు కాను న్నారు. భేటీలో ప్రధానంగా సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల పంపిణీ పై చర్చ జరగనుంది. సాగర్‌లో 502 అడుగులు, శ్రీశైలం లో 775 అడుగుల వరకు నీటిని ఇరు రాష్ట్రాలు తీసుకోవాల్సి ఉంది.

ఈ మట్టాల వద్ద ప్రస్తుతం 2 నుంచి 3 టీఎంసీల నీరు మాత్రమే ఉండటం, ఆ నీరంతా ఏపీకే దక్కనుండటంతో తెలంగా ణ తన అవసరాల కోసం రెండు ప్రాజెక్టులో మరింత దిగువకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరుతోంది. సాగర్‌లో 500 అడుగులు, శ్రీశైలంలో 765 అడుగుల మట్టం వరకు వెళ్లేందుకు అవకాశం ఇస్తే హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలు తీరుతా యని చెబుతోంది.

నల్లగొండకు 2.25 టీఎంసీ, హైదరాబాద్‌కు 2 టీఎంసీలు ఇవ్వాలని ఇటీవలే విన్నవించింది. దీనిపైనా కమిటీ నిర్ణయం తీసుకోవాల్సిఉంది. దీంతో పాటే టెలీమెట్రీ పరికరాలపైనా చర్చ జరగనుంది. మొదటి విడతలో 18 పాయిం ట్లలో చాలా చోట్ల రాష్ట్రంలో పనులు పూర్త యినా ఏపీలో పూర్తవలేదు. రెండో విడతలో మరో 28 చోట్ల ఏర్పాటు చేయాల్సిఉన్నా, ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిన 17 పాయింట్లపైనా చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు