నేటి వార్తా విశేషాలు

19 Mar, 2017 07:42 IST|Sakshi

ఎమ్మెల్సీ రీ పోలింగ్‌
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రీ పోలింగ్‌ నేడు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌. ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో ఆదిలక్ష్మయ్య, పాపాన్నగారి మాణిక్‌రెడ్డిల ఫొటోలు తారుమారవడంతో రీపోలింగ్‌ జరుపుతున్న విషయం తెలిసిందే.

సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణం
ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే.. డిప్యూటీ సీఎంలుగా కేశవ్‌ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మ ప్రమాణం చేయనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరుకానున్నారు.

మహాజన పాదయాత్ర ముగింపు సభ
హైదరాబాద్‌: నేడు సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభ. సరూర్‌నగర్‌ ఔట్‌డోర్‌ స్టేడియంలో జరగనున్న బహిరంగసభ. హాజరుకానున్న కేరళ సీఎం పి. విజయన్‌.

టీజేఏసీ సమావేశం
హైదరాబాద్‌: ఇవాళ జరిగే తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.

తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.

మరిన్ని వార్తలు