రేపు నవ్య నాటక సమితి వజ్రోత్సవాల ప్రారంభం

23 Apr, 2017 00:04 IST|Sakshi
రేపు నవ్య నాటక సమితి వజ్రోత్సవాల ప్రారంభం

వజ్రోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సమితి సభ్యులు

వివేక్‌నగర్‌: నవ్య నాటక సమితి వజ్రోత్సవాల ప్రారంభోత్సవం  ఈనెల 24 సాయంత్రం 5.30కి త్యాగరాయ గానసభలో జరుగుతుందని నవ్య నాటక సమితి అధ్యక్షుడు వేమరాజు వియ్‌కుమార్‌ తెలిపారు. వజ్రోత్సవాల పోస్టర్‌ను శనివారం  కామిశెట్టి శ్రీనివాసులు, సుధామాల, వల్లూరి శ్రీమణిలతో కలిసి ఆయన ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ... 24న జరిగే నవ్యనాటక సమితి వజ్రోత్సవాల ప్రారంభకార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు వ్యవస్థాపక సంచాలకులు కామిశెట్టి శ్రీనివాసులు నిర్వహణలో ప్రముఖ గాయని టి.శ్రీనిధి అన్నమాచార్యుని సంకీర్తనలు గానం చేస్తారన్నారు. సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణ, భావరాజు నారాయణ మూర్తి తదితరులు పాల్గొంటారని తెలిపారు.

మరిన్ని వార్తలు