పర్యాటక అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు

22 Mar, 2016 10:46 IST|Sakshi

హైదరాబాద్ : సమైక్య పాలనలో తెలంగాణ టూరిజం గుర్తింపునకు నొచుకోలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ...  ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కట్టడాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎ.చందూలాల్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని వివరించారు. అందులోభాగంగా హెలీ టూరిజం ఏర్పాటు చేసిన విషయాన్ని చందూలాల్ గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు