‘హెచ్‌ఎండీఏ’ ఉద్యోగులకు ఉత్తమ్ భరోసా

26 Apr, 2015 01:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏలో తొలగించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. తమను అకారణంగా తొలగించారంటూ పలువురు ఉద్యోగులు ఉత్తమ్‌ను, మాజీ మంత్రి డి.కె.అరుణను గాంధీభవన్‌లో శనివారం కలిశారు.  తొలగించినవారిని విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తామని, బాధితులకు అండగా ఉంటామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు