'కేసీఆర్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం'

14 Mar, 2016 17:46 IST|Sakshi

హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను అవమానపరిచేలా స్పీకర్, సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చించినట్లు ఉత్తమ్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానంపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

బడ్జెట్ పై ఉత్తమ్ స్పందిస్తూ.. తెలంగాణ బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని, ఇదసలు ఆచరణకు సాధ్యం కాని బడ్జెట్ అని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా కేసీఆర్ మారుస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల శాఖలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించారని, కుటుంబ పాలన జరుగుతోందని అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రాజెక్టుల టెండర్ల విషయంలో భారీ అవినీతి జరుగుతోందని ఉత్తమ్ ఆరోపించారు.

మరిన్ని వార్తలు