ఉపాధికి ఉచిత శిక్షణ

13 Oct, 2016 23:00 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టెక్‌మహీంద్రా ఫౌండేషన్, నిర్మాణ్‌ ఎన్జీవోలు అవకాశాలు కల్పిస్తున్నాయి. పదవ తరగతి పాసై ఇంటర్, డిగ్రీ ఫెయిల్‌ లేదా పాసైన విద్యార్థులు తాము కల్పించే శిక్షణా తరగతులకు హాజరు కావచ్చునని నిర్మాణ్‌ సంస్థ ప్రతినిధి కె.నిరంజన్‌ యాదవ్‌ తెలిపారు. 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు యువతీ యువకులకు 90 రోజుల పాటు ఉచితంగా శిక్షణనిచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. కంప్యూటర్‌ బేసిక్స్, ఎంఎస్‌ ఆఫీస్, స్పోకెన్‌ ఇంగ్లీష్, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో శిక్షణ ఉంటుందన్నారు. బీకాం పాసైన వారికి మాత్రం టాలీ, ఈఆర్‌పీ–9, బేసిక్‌ అకౌంట్స్, ఎంఎస్‌ ఎక్సెల్‌ కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తవగానే సర్టిఫికెట్‌ ఇస్తారు. కూకట్‌పల్లిలో ఉన్న ఈ శిక్షణా కేంద్రానికి ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 90300 55998, 91003 30378 నెంబర్లకు ఫోన్‌ చేయచ్చు.

మరిన్ని వార్తలు