ట్రైనీకానిస్టేబుళ్లకు మే 1 నుంచి శిక్షణ

23 Apr, 2017 02:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టెపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఎస్‌సీటీపీసీఎస్‌) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మే 1వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు ఐజీ (శిక్షణ) చారు సిన్హా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు యూనిట్‌ అధికారులకు రిపోర్ట్‌ చేయాలని అన్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 8 గంటలకు కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో రిపోర్టింగ్‌ చేసేందుకు ఆయా యూనిట్‌ అధికారులు పంపుతారని తెలిపారు.

అభ్యర్థులు శిక్షణ కేంద్రంలో రిపోర్టింగ్‌ చేసేటప్పుడు మెస్, ఇతర చార్జీలకు రూ.6,000 జమ చేయాలని (మెస్‌ చార్జీలు శిక్షణ అనంతరం వాపసు చేస్తారు) చెప్పారు. అభ్యర్థులు వారి వెంట 2 కాకి నిక్కర్లు, 2 చిన్న చేతుల తెల్ల బనియన్లు, ప్లాస్టిక్‌ బకెట్, మగ్, బూట్‌ పాలిష్, బూట్‌ బ్రష్, ఒక జత తాళం, దిండు తెచ్చుకోవాలని సూచించారు. అలాగే ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్, ఆరోగ్య భద్రత కార్డుల కోసం 10 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు తీసుకురావాలని ఆమె కోరారు. శిక్షణ కేంద్రానికి అభ్యర్థులు విలువైన వస్తువులు తేవద్దని తెలిపారు.

మరిన్ని వార్తలు