ట్రెజరీ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి

1 Feb, 2017 00:20 IST|Sakshi

ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: ట్రెజరీ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని తెలంగాణ ట్రెజరీ ఎన్జీవో అసోసియేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ సంఘం మొదటి వార్షికోత్సవం మంగళవారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని సాయిబాబా అంధుల పాఠశాలలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ట్రెజరీ శాఖలో పనిచేస్తున్న ఎన్జీవోల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాన న్నారు. అనంతరం టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ..కొత్త జిల్లాల ఏర్పాటుతో ట్రెజరీ శాఖలో ఉద్యోగులపై పనిభారం పెరిగిందన్నారు.

ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలించి శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేటెడ్‌ అధ్యక్షుడు పర్వతాలు, సంయుక్త కార్యదర్శి శైలజ, జిల్లా అధ్యక్షుడు జగన్, కార్యదర్శి రఫిక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించేందుకు సంఘం ప్రతినిధులు పాఠశాలకు ఆర్థికసాయం అందించారు.

మరిన్ని వార్తలు