హర్షధ్వానాల మధ్య ఆరు తీర్మానాలు

28 Apr, 2018 02:13 IST|Sakshi

ఆమోదించిన ప్లీనరీ

కేసీఆర్‌ పాలనపై ప్రతినిధుల పొగడ్తల వర్షం

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ 17వ ప్లీనరీలో మొత్తం ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఎంపీ కె.కేశవరావు ‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’పేరుతో మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ఎంపీ వినోద్‌తోపాటు టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్‌ బలపరిచారు. సంక్షేమంపై ఎమ్మెల్యే రసమయి రెండో తీర్మానాన్ని ప్రతిపాదించగా.. టీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచందర్‌రావు బలపరిచారు.

ఈ సందర్భం గా రసమయి మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వాల మేనిఫెస్టోలు చూశాం. ఆ మేనిఫెస్టోల్లో పెట్టిన అంశాలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేసి చూపిస్తున్నాం. రూ.40 వేల కోట్లతో 40 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వమిది. ఎవరికీ ఆలోచన రాని విధంగా.. మానవీయ కోణంలో ఆలోచించి అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు’’అని పేర్కొన్నారు.


ఆ ఘనత కేసీఆర్‌దే..
వ్యవసాయ విధానంపై ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మూడో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ బలపరిచారు. రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవ సాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్‌ నడుం బిగించారన్నారు. ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.8 వేలు పంట పెట్టుబడి ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు పం ట రుణాలను మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దేన్నారు.

ప్రభు త్వం రైతులకు 24 గంటల కరెం ట్‌ ఇస్తోందని, పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిందని కొనియాడారు. మైనార్టీల సంక్షేమంపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ నాలుగో తీర్మానం ప్రతిపాదించగా.. ఇంతియాజ్‌ అహ్మ ద్‌ బలపరిచారు. షకీల్‌ మాట్లాడుతూ.. గత ప్ర భుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడు కున్నాయని, కానీ సీఎం కేసీఆర్‌ వారికోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు.

ఆడబిడ్డల గోస తీర్చేందుకు భగీరథ
మౌలిక సదుపాయాల కల్పనపై పద్మాదేవేందర్‌రెడ్డి ఐదో తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌ బలపరిచారు. పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆడబిడ్డల గోస తీర్చేందుకు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించబోతున్నట్లు చెప్పారు.

సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడూ రుణపడి ఉంటారన్నారు. టీఎస్‌ఐపాస్‌తో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. టీ హబ్‌ ఇంక్యుబేటర్‌ వల్ల స్టార్టప్‌ కంపెనీలు  ఏర్పాటవుతున్నాయని, ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ కంపెనీలను విస్తరిస్తామన్నారు. చివరగా పాలనా సంస్కరణలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి బలపరిచారు.  

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా