అభివృద్ధిని అడ్డుకుంటే భూస్థాపితమే

29 Dec, 2015 03:06 IST|Sakshi
అభివృద్ధిని అడ్డుకుంటే భూస్థాపితమే

కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపాటు

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తే కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా భూస్థాపితం చేయడం ఖాయమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. మహానగరాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కాంగ్రెస్ గత ప్రభుత్వాలదేనని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను గుడిసెల నగరంగా, మురికి గుంతలకు ఆలవాలంగా, కబ్జాదారుల అడ్డాగా కాంగ్రెస్ నేతలు తయారు చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు పునాది రాళ్లు వేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు