టీఆర్‌ఎస్‌ ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ

9 Apr, 2017 03:40 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ

12 ప్రాధాన్య అంశాల గుర్తింపు: కేకే

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో తీర్మానాలు ప్రవేశ పెట్టడానికి 12 ప్రాధాన్య అంశాలను గుర్తించామని టీఆర్‌ఎస్‌ ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్, పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు చెప్పారు. ఆయన నివాసంలో పార్టీ ప్లీనరీ తీర్మానాల కమిటీ శనివారం భేటీ అయింది. కమిటీ సభ్యులు ఎంపీ వినోద్‌ కుమార్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పర్యాద కృష్ణమూర్తి హాజరయ్యారు.

కమిటీ గుర్తించిన ప్రాధాన్య అంశాలను చర్చించి రాజకీయ తీర్మానాలు కూడా ఆమోదిస్తామని, సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. బీసీ, ఎంబీసీల అభివృద్ధి, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలపై తీర్మానాలు ఉంటాయన్నారు. నీటిపారుదల రంగం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు తదితర తీర్మానాలు చేస్తామన్నారు. పదహారో ప్లీనరీని ఈ నెల 21న కొంపల్లిలోని జీబీఆర్‌ గార్డెన్స్‌లో, పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు