ఆంధ్రావాళ్లపై ఈగ వాలనివ్వలేదు: కేటీఆర్

31 Dec, 2015 17:50 IST|Sakshi
ఆంధ్రావాళ్లపై ఈగ వాలనివ్వలేదు: కేటీఆర్

హైదరాబాద్ : పేదవాళ్లు ఏ ప్రాంతం వాళ్లైనా తమకు ఒక్కటే అని పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ 'ఈ 18 నెలల్లో ఏ ఒక్క ఆంధ్రావారిపై ఈగ వాలనివ్వలేదు. ఆంధ్రావాళ్లను ఇక్కడ నుంచి పంపించేస్తారని ప్రచారం చేశారు. హైదరాబాద్లోని సీమాంధ్ర వారిలో ఏ ఒక్కరికైనా నష్టం జరిగిందా?. సంక్షేమ పథకాల అమల్లో పక్షపాతం చూపించామా?. అన్ని ప్రాంతాల వారిని కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. మురికివాడలో తిరిగిన సీఎం ఎవరైనా ఉన్నారా?.

బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. పేకాట క్లబ్బులు మూయించిన ఘనత కేసీఆర్దే. రాష్ట్రం విడిపోవడం వల్ల రెండు ప్రాంతాలు లబ్ధి పొందాయి. లేకుంటే ఏపీలో కొత్త నగరాలు వచ్చేవి కావు. హైటెక్ సిటీ కట్టించాం అనేవాళ్లు కింద మోరీలు కట్టుడు మరిచారు. హైదరాబాద్లో గీత కార్మికులను కాపాడుకుందాం.  అలాగే నగరంలో పేదలకు నల్లా, కరెంట్ బిల్లు మాఫీ చేయించిన ఘనత కేసీఆర్దే. ఆంధ్రావాళ్లు సంక్రాంతికి ఇళ్లకు వెళ్లి వచ్చాకే జీహెచ్ఎంసీ ఎన్నికలు. వారి ఓట్లతోనే జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. గ్రేటర్ ఎన్నికల్లో పొత్తులు లేవు. ఒంటరిగానే పోటీ చేస్తాం. రిజర్వేషన్స్ ప్రకటన తర్వాత గెలుపు గుర్రాలకే టిక్కెట్లు. 75 సీట్లు మహిళలకే' అని తెలిపారు.

మరిన్ని వార్తలు