నిజం.. నిజాం నాటి నాణెం

17 Nov, 2015 02:23 IST|Sakshi
నిజం.. నిజాం నాటి నాణెం

చార్మినార్ వద్ద విక్రయానికి నిజాం కాలం నాటి నాణేలు

 చార్మినార్:  పాతబస్తీ పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి వస్తున్న వారికి చార్మినార్ కట్టడం వద్ద నిజాం కాలం నాటి పురాతన నాణేలు ఆకట్టుకుంటున్నాయి. వీటిని ఖరీదు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నిజాం కాలం నాటి పురాతన నాణేలను ఇప్పటి యువతరానికి అంతగా తెలియకపోవచ్చు. చూద్దామన్నా... ఎవరి దగ్గరా దొరక్కపోవచ్చు. నిజాం కాలంలో ఏక్ అణా.. దో అణా.. చార్ అణా.. అనే పైసలు చెలామణిలో ఉండేవి. 

వాటితో పాటు దాదాపు 50 దేశాలకు చెందిన పురాతన కరెన్సీలను ఇక్కడి చార్మినార్ కట్టడం వద్ద ఫుట్‌పాత్‌పై పాతబస్తీకి చెందిన ఓ వ్యాపారి విక్రయిస్తున్నాడు. నిజాం కాలం నాటి ఒక రూపాయి నాణెం ధర ప్రస్తుతం రూ. 1500, చార్‌ఆణ 25 (పైసలు) ఖరీదు రూ. 800 లు గాను... ఏక్ ఆణ ఖరీదు రూ. 150 గాను... ఒక పైస ఖరీదు రూ. 100 గా విక్రయిస్తున్నట్లు నాణేల వ్యాపారి తెలిపాడు.
 
 

మరిన్ని వార్తలు