గురువును మించిన శిశ్యుడు

10 Apr, 2014 01:26 IST|Sakshi

రాజగోపాలరెడ్డి కారు డ్రైవరే
‘పీజీఎంఈటీ-2014’ లీకువీరుడు


 బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ (ఆర్‌జీయూహెచ్‌ఎస్-2007) ప్రశ్నపత్రం లీకేజ్... కన్సార్టియమ్ ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కొమెడ్ కే-2011) బోగస్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజగోపాలరెడ్డికి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తే విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఎంఈటీ-2014) లీకేజ్‌లో సూత్రధారిగా సీఐడీ అధికారులు గుర్తించారు.

ఇతడే కర్ణాటకలోని ఉడిపి, దావణగెరెలకు చెందిన మరికొందరితో కలిసి ముఠా కట్టి వ్యవహారాన్ని నడిపినట్లు నిర్థారించారు. ఈ కేసు దర్యాప్తు పూర్తిచేసిన సీఐడీ ప్రత్యేక బృందాలు బుధవారం కీలక సూత్రధారులతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. వీరిని గురువారం అరెస్టు చేసే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు