ఇంటికి చేరిన తెలుగు ప్రొఫెసర్లు

24 Sep, 2016 12:10 IST|Sakshi
ఇంటికి చేరిన తెలుగు ప్రొఫెసర్లు

హైదరాబాద్‌: గతేడాది లిబియాలో ఉగ్రవాదుల చేతుల్లో కిడ్నాప్కు గురై వారి చెర నుంచి బంధీలుగా విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలు శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఏడాదిపాటూ ఐసిస్ కిడ్నాపర్ల చెరలో ఉన్న ప్రొఫెసర్ల విడుదలలో కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కీలకంగా వ్యవహరించారు. విదేశాంగశాఖ అధికారులు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలను వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.  

2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ లిబియాలోని సిర్టే యూనివర్శిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్ సమీపంలో వారు కిడ్నాప్ కు గురయ్యారు. వారిలోని కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను రెండురోజుల్లోనే వదిలేసిన ఉగ్రవాదులు.. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరామ కిషన్,  శ్రీకాకుళం టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణలను మాత్రం చెరలోనే ఉంచారు. వారి విడుదలకోసం లిబియా దేశ రాయబారితో అప్పట్నుంచీ కేంద్రం చర్చలు జరిపి సఫలమయ్యింది.

మరిన్ని వార్తలు