-

ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు వరుసల రోడ్లు

11 Jan, 2017 00:27 IST|Sakshi
ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు వరుసల రోడ్లు

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంత రోడ్ల పథకం కింద కేంద్రం మంజూరు   
600 కి.మీ. మేర రూ.1,590 కోట్లతో నిర్మాణం

 
 సాక్షి, హైదరాబాద్: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొంతకాలంగా పరిశీలన పేరుతో పెండింగులో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి ఎట్టకేలకు ఓకే చెప్పింది. పాత ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 29 రోడ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. కొద్దిరోజుల క్రితమే సూత్రప్రాయ ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అనుమతి మంజూరు చేసింది. 600 కిలోమీటర్ల మేర నిర్మితమయ్యే ఈ రోడ్లకు రూ.1,590 కోట్లు ఖర్చు కానున్నారుు. ముఖ్యంగా గోదావరి నదీ తీరం వెంబడి ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా రోడ్ల నిర్మాణం జరగనుంది.

ఇప్పటి వరకు అసలు రోడ్డంటూ లేకుండా కచ్చా బాటకే పరిమితమైన చోట్ల కూడా రెండు వరుసల రోడ్లు నిర్మితం కానుండటం విశేషం. అలాగే ప్రస్తుతం సింగిల్ రోడ్డుగా ఉన్న రహదారులను కూడా రెండు వరుసలకు విస్తరిస్తారు. ప్రధాన రహదారులు, జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న వామపక్ష తీవ్రవాదుల కదలికలు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్‌‌స నివేదికలు అందిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణరుుంచింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల డీజీపీల సదస్సులో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని వేగిరం చేయాలని కేంద్రం నిర్ణరుుంచటంతో రాష్ట్ర ప్రతిపాదనకు మోక్షం కలిగినట్టరుుంది.

 రాష్ట్ర ప్రభుత్వంపై భారం
 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం పథకానికి ఇంతకాలం మొత్తం నిధులు కేంద్రమే విడుదల చేసేది. తాజాగా ఆ నిబంధనలు సడలించి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించాలని తేల్చింది. దీంతో ఇప్పుడు కొత్తగా మంజూరైన రోడ్ల వ్యయంలో 40 శాతం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడబోతోంది. దాదాపు రూ.630 కోట్ల మేర రాష్ట్ర ఖజానాపై భారం పడనుంది.

మరిన్ని వార్తలు