త్వరలో ఆరోగ్య వర్సిటీలో పోస్టుల భర్తీ

19 Apr, 2016 00:32 IST|Sakshi
త్వరలో ఆరోగ్య వర్సిటీలో పోస్టుల భర్తీ

♦ 80 పోస్టుల భర్తీకి కసరత్తు.. అందులో 60 ప్రమోషన్ల ద్వారానే
♦ మిగిలిన 20 పోస్టులు రాత పరీక్ష ద్వారా నేరుగా నియామకం
 
 సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 80 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రిజిస్ట్రార్, వైస్ చాన్స్‌లర్లను నియమించిన ప్రభుత్వం ఇక పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరిగేలా పరిపాలనా సిబ్బందిని భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చినందున వీలైనంత త్వరలో నోటిఫికేషన్ ద్వారా వాటిని  భర్తీ చేస్తామని వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. భర్తీ ప్రక్రియను విశ్వవిద్యాలయమే నిర్వహించే అవకాశం ఉంది.

మొత్తం 80 పోస్టుల్లో 60 పోస్టులను వివిధ విశ్వవిద్యాలయాల్లోని వారిని పదోన్నతుల ప్రాతిపదికపై నియమిస్తారు. పదోన్నతుల ద్వారా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, జాయింట్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సూపరింటెండెంట్లు సహా ఇతర పోస్టులను భర్తీ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్లు సహా ఇతర కేడర్ పోస్టులు 20 వరకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించి తీసుకుంటారు. అలాగే వచ్చే మెడికల్ కౌన్సిలింగ్ బాధ్యత కూడా ఈ విశ్వవిద్యాలయమే నిర్వహించనున్నందున సిబ్బంది అవసరం చాలా ఉంది.

మరిన్ని వార్తలు