విద్యార్థి మృతికి యూనివర్సిటీ సంతాపం

17 Sep, 2016 14:54 IST|Sakshi

ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి నెల్లి ప్రవీణ్ కుమార్ మృతిపట్ల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంతాపం తెలిపింది. యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగం శనివారం ఉదయం ఒక సంతాప సభ నిర్వహించింది. జరిగిన విషయాలను యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో ప్రవీణ్ రూమ్మేట్ పెయింటింగ్ స్టూడియో నుంచి తిరిగి గదికి వచ్చాడని, అయితే అప్పటికి గది లోపలి నుంచి గడియ పెట్టి ఉందని తెలిపారు. ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయకపోవడంతో హాస్టల్లో ఉన్న ఇతర మిత్రులను లేపి విషయం చెప్పగా అంతా కలిసి బలంగా తలుపును తోసి చూసేసరికి.. సీలింగ్‌కు ప్రవీణ్ వేలాడుతున్నాడన్నారు.

వెంటనే యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌కు అతడిని తరలించామని, ప్రాథమిక పరీక్షల అనంతరం సిటిజన్ ఆస్పత్రికి పంపామని తెలిపారు. అయితే అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రవీణ్ మరణించినట్లు చెప్పారన్నారు. అనంతరం ప్రవీణ్ మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని, యూనివర్సిటీ అధికారులు, ఫ్యాకల్టీ సభ్యులు అతడి కుటుంబ సభ్యులతోను, సన్నిహిత మిత్రులతోను టచ్‌లో ఉన్నారని ఆ ప్రకటనలో తెలిపారు.

>
మరిన్ని వార్తలు