సాగర యాగం

18 Feb, 2015 09:53 IST|Sakshi
సాగర యాగం

*హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు రంగం సిద్ధం
*విభిన్న శాఖల భాగస్వామ్యం
*ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నం
*వేసవిలో ముహూర్తం

 
ఒక మహా యజ్ఞానికి భాగ్యనగరం వేదికవుతోంది.ఒక మహా ప్రయత్నానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మహా నగరి మెడలో మణిహారంలా భాసిల్లుతున్న హుస్సేన్ సాగర్‌ను శుద్ధ జలంతో నింపే క్రతువుకు రంగం సిద్ధమవుతోంది. కాలుష్య కాసారంలా మారిన సాగర్‌ను ఖాళీ చేసి...
 
భవిష్యత్తులో శుద్ధి చేసిన నీటిని నింపే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. వేసవిలో ఈ మహా యజ్ఞం నిర్వహణకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ముందుగా సాగర్‌ను ఖాళీ చేసి... పూడికను తొలగించేందుకు వివిధ విభాగాలు యత్నాలు మొదలుపెట్టాయి. నీరు తోడడం... పూడిక తొలగించడం వంటి పనులకు ఎంత సమయం పడుతుంది...ఎంత వ్యయమవుతుందనే విషయమై లెక్కలు వేస్తున్నాయి. సాగర్ ప్రక్షాళనతో పాటు పరిసరాలను పచ్చదనంతో నింపి... సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు అవసరమైన
 కార్యాచరణపై కసరత్తు ప్రారంభించాయి. విభిన్న శాఖల సమన్వయంతో ఈ బృహత్తర  కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది.
 

మరిన్ని వార్తలు