'మంత్రి కేటీఆర్ ఓ బచ్చా'

12 Jan, 2016 17:19 IST|Sakshi
'మంత్రి కేటీఆర్ ఓ బచ్చా'

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా సవాల్పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించారు. మంత్రి కేటీఆర్ ఓ బచ్చా అని ఎద్దేవా చేశారు.  గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ100 సీట్లు గెలుస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేసీఆర్ అలా చెబితే తాము దేనికైనా సిద్ధమని ఉత్తమ్కుమార్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఓ వేళ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్పై మంగళవారం ఖైరతాబాద్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న  ఉత్తమ్కుమార్రెడ్డి పైవిధంగా స్పందించారు.

మరిన్ని వార్తలు