'అమెరికాలోని వైద్యుల్లో సగం మంది భారతీయులే'

7 Nov, 2015 12:09 IST|Sakshi
'అమెరికాలోని వైద్యుల్లో సగం మంది భారతీయులే'

హైదరాబాద్ : భారతదేశానికి గొప్ప సంస్కృతి, సంప్రదాయం ఉందని కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ లీడర్ షిప్ సదస్సులో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ.... భారత్కు చెందిన అనేక మంది విదేశాలలో ఉన్నత పదవులను అలంకరించారని తెలిపారు.

అమెరికాలో ఉన్న వైద్యుల్లో సగం మంది భారతీయులే అని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాంకేతిక రంగంలో పురోగతి దిశగా భారత్ ముందుకు సాగుతుందన్నారు.హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి గాంచిందని చెప్పారు. ఐఎస్బీ పరిశోధనల వల్ల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. భారత్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు