'బరువు పెరిగి టీఆర్ఎస్ మునుగుతుంది'

5 Dec, 2015 15:04 IST|Sakshi
'బరువు పెరిగి టీఆర్ఎస్ మునుగుతుంది'
హైదరాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని నేతలు పార్టీ మారడం సరికాదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(వీహెచ్) అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి చెందిన నేతల ఫిరాయింపులు, తదితర అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇతర పార్టీల నేతల ఫిరాయింపులను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సహించడం మంచిది కాదన్నారు. టీఆర్ఎస్ పెద్దలు సొంత క్యాడర్నే తయారుచేసుకోవాలని వీహెచ్ సూచించారు. 
 
కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుంటే బరువు పెరిగి టీఆర్ఎస్ మునుగుతుందని వ్యాఖ్యానించారు. పార్టీని వీడొద్దని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క పిలుపునివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలకు సూచించారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించారని, అటువంటి వ్యక్తి పార్టీ మారుతాననడం సరికాదని వీహెచ్ హితవు పలికారు.
మరిన్ని వార్తలు