'ఆ విషయం కేసీఆర్‌కూ తెలుసు'

23 Apr, 2016 13:47 IST|Sakshi
'ఆ విషయం కేసీఆర్‌కూ తెలుసు'

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని రాజ్యసభ సభ్యుడు వీహెచ్ తెలిపారు. ఆ విషయం టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ తెలుసునని చెప్పారు. శనివారం న్యూఢిల్లీలో కుటుంబ సభ్యులతో కలసి వీహెచ్... సోనియాగాంధీని ఆమె నివాసంలో కలిశారు.

అనంతరం వీహెచ్ మాట్లాడుతూ...మూడు సార్లు రాజ్యసభకు పంపినందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. కాంగ్రెస్ త్యాగాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యామని ఆయన తెలిపారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని వీహెచ్ ఈ సందర్బంగా చెప్పారు. ఓబీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు