ట్యాంక్బండ్ వద్ద వీహెచ్ మౌన దీక్ష

27 Jan, 2016 10:06 IST|Sakshi

హైదరాబాద్ : హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లో ట్యాంక్బండ్ సమీపంలోని భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మౌన దీక్ష చేపట్టారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని... అలాగే హెచ్సీయూలో సస్పెండ్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా హెచ్సీయూలో బుధవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అందులోభాగంగా యూనివర్సిటీలోని అన్ని విభాగాలను విద్యార్థి సంఘాలు మూసివేయిస్తున్నాయి.

 

 

మరిన్ని వార్తలు