'తల్లిదండ్రులను పిలిపించి పెళ్లిళ్లు చేస్తాం'

9 Feb, 2015 12:44 IST|Sakshi
'తల్లిదండ్రులను పిలిపించి పెళ్లిళ్లు చేస్తాం'

హైదరాబాద్ :  వాలంటైన్స్ డే జరుపుకోవడానికి ప్రేమ జంటలు  ఎదురు చూస్తుంటే...మరోవైపు  విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ), భజరంగ్దళ్..ప్రేమికుల రోజును బహిష్కరించాయి. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు పేరుతో విచ్చలవిడి కార్యకలాపాలు చేస్తే ఊరుకునేది లేదని వీహెచ్పీ నేతలు రామరాజు, వెంకటేశ్వర రాజు హెచ్చరించారు. ప్రేమికులు ఆరోజు జంటగా కనిపిస్తే వారి తల్లిదండ్రులను పిలిపించి పెళ్లిళ్లు చేస్తామని వారు తెలిపారు. పబ్లు, హోటళ్లు, రిసార్ట్స్లో ప్రేమికుల రోజున ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టకూడదని వీహెచ్పీ నేతలు సూచించారు.

 

మరిన్ని వార్తలు