బాంచన్‌.. నీ కాల్మొక్తా’ను మళ్లీ తీసుకొస్తుండు

30 Aug, 2017 03:58 IST|Sakshi

కేసీఆర్‌పై భట్టి ఫైర్‌
సాక్షి, హైదరాబాద్‌: నామినేటెడ్‌ వ్యవస్థతో భూవివాదాలు పరిష్కరిస్తారా అని ప్రభు త్వాన్ని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 39 ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేసేలా ఉందని.. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయడానికే జీవో తీసుకొచ్చారని ఆరోపించారు.

‘బాంచన్‌ దొరా.. నీ కాల్మొక్తా’ అని గ్రామాల్లో పటేల్, పట్వారీలను వేడుకునే వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చేలా కేసీఆర్‌ పని చేస్తున్నారన్నా రు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జీవో 39 ద్వారా రాష్ట్రంలో భూ మాఫియా ను తయారు చేయబోతున్నారన్నారు. రైతు సమన్వయ సమితులతో నిజమైన భూ హక్కుదారులకు అన్యాయం జరగబోతోం దని ఆందోళన వ్యక్తం చేశారు. భూములపై హక్కులు నిర్ధారించాల్సిన రెవెన్యూ శాఖ, సాగు వివరాలను నమోదుచేయాల్సిన వ్యవసాయశాఖ పనులను టీఆర్‌ఎస్‌ నేతలకు ఎందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు.  చట్ట వ్యతిరేకమైన ఈ జీవో 39ని తక్షణమే రద్దుచేయాలన్నారు.

మరిన్ని వార్తలు