మాల్యా చెక్ బౌన్స్ కేసులో కొత్త ట్విస్ట్

25 May, 2016 11:36 IST|Sakshi
మాల్యా చెక్ బౌన్స్ కేసులో కొత్త ట్విస్ట్

హైదరాబాద్ : బ్యాంకుల్లో రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యా చెక్బౌన్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. జీఎంఆర్ సంస్థ నమోదు చేసిన చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు జారీ చేసిన వారెంట్ను ముంబై విలేపార్లే పోలీసులు తిప్పిపంపారు. కాగా మాల్యా నివాసాన్ని ఎస్బీఐ సీజ్ చేసిందని, కింగ్ఫిషర్కు చెందిన యాజమాన్యం, ఉద్యోగులెవరూ లేరని ముంబై పోలీసులు బుధవారం లిఖితపూర్వకంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో మాల్యా కొత్త చిరునామాను జూన్ 6లోగా తెలపాలని పోలీసుల్ని ఎర్రమంజిల్ కోర్టు ఆదేశించింది.  అలాగే మాల్యాకు మరోసారి వారంట్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

కాగా విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌వేస్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ను వాడుకున్నందుకు గాను జీఎంఆర్ సంస్థకు గతంలో విజయ్ మాల్యా చెక్కులను సమర్పించారు. అయితే, ఈ చెక్ బౌన్స్ కావడంతో జీఎంఆర్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జీఎంఆర్ సంస్థకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలకు గాను ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు