వైఎస్ జగన్ను కలిసిన విజయ సాయిరెడ్డి

31 May, 2016 16:39 IST|Sakshi
వైఎస్ జగన్ను కలిసిన విజయ సాయిరెడ్డి

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో  ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు విజయ సాయిరెడ్డి ఈ సందర్భంగా వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి విజయ సాయిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరోవైపు ఆయనకు పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు అభినందనలు తెలిపారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు విజయ సాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఏపీ నుంచి సుజనా చౌదరి (టీడీపీ), టీజీ వెంకటేష్ (టీడీపీ), సురేష్ ప్రభు (బీజేపీ), విజయ సాయిరెడ్డి (వైఎస్ఆర్ సీపీ) నామినేషన్లు వేశారు. అలాగే తెలంగాణ నుంచి డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు టీఆర్ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు