వీసీ అప్పారావును రీకాల్ చేయాలి: చాడ

7 Apr, 2016 02:54 IST|Sakshi
వీసీ అప్పారావును రీకాల్ చేయాలి: చాడ

సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ వీసీ అప్పారావును రీకాల్ చేయడానికి బదులుగా అకడమిక్ కౌన్సిల్ సమావేశం ద్వారా కేంద్రం ఆయనకు నైతిక బలాన్ని చేకూర్చడం పట్ల సీపీఐ నిరసన వ్యక్తం చేసింది. రోహిత్ ఆత్మహత్య తర్వాత ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హెచ్‌సీయూ ఘటనపై సీఎం స్పందిస్తూ అప్పారావును రీకాల్ చేయాల్సిందిగా ప్రధానిని కోరతానని ప్రకటించినట్లు ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గుర్తుచేశారు. విశ్వవిద్యాలయాల్లో ప్రశాంత పరిస్థితిని నెలకొల్పడానికి వీసీ అప్పారావును వెంటనే రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సీఎం నుంచి ఎలాంటి స్పందన లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు