మునిసిపల్ కమిషనర్లు కావలెను!

16 Apr, 2015 01:47 IST|Sakshi
మునిసిపల్ కమిషనర్లు కావలెను!

మొత్తం 166 పోస్టుల్లో పనిచేస్తున్నది 48 మందే
రాష్ట్రంలో మూడొంతులకు పైగా పోస్టులు ఖాళీలే  
48మంది కమిషనర్‌లతో సహా పురపాలికల్లో 333 పోస్టుల భర్తీ!
ప్రభుత్వానికి ప్రతిపాదించిన పురపాలక శాఖ  
టౌన్ ప్లానింగ్‌లో మరో 138 పోస్టులకు ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడొంతులకు పైగా మునిసిపల్ కమిషనర్ పోస్టులు ఖాళీగా వున్నాయి.

రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో మొత్తం 166 మంది మునిసిపల్ కమిషనర్లు పనిచేయాల్సి  ఉండగా, కేవలం 48 మంది మాత్రమే  ఉన్నారు. సరిపడా సంఖ్యలో కమిషనర్లు లేకపోవడంతో ప్రభుత్వం చాలా మునిసిపాలిటీలకు మునిసిపల్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, మేనేజర్లను ఇన్‌చార్జి కమిషనర్లుగా నియమించింది. సమర్థులైన అధికారులు లేకపోవడంతో చాలా పురపాలికల్లో వ్యవహారాలు గాడితప్పాయి.

మునిసిపల్ కమిషనర్ పోస్టులే కాదు.. అకౌంటెంట్లు, బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ తదితర కేటగిరీల పోస్టుల్లో సైతం సగానికి పైగా ఖాళీలే వున్నాయి. మునిసిపాలిటీల్లో ఖాళీగా వున్న పోస్టుల్లో తొలి విడత కింద 48 కమిషనర్ పోస్టులతో సహా మొత్తం 333 ఇతర పోస్టులను భర్తీ చేయాలని పురపాలక శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందుకు అనుమతించాలని కోరుతూ ఆర్థిక శాఖకు పురపాలక శాఖ లేఖ రాసింది. ఆ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.
 
టౌన్ ప్లానింగ్‌లో 138 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు..

మునిసిపాలిటీల్లో ఖాళీగా వున్న 138 పట్టణ ప్రణాళికా విభాగం ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్(డీటీసీపీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అందులో 119 బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులుండగా.. మిగిలిన పోస్టులు టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, ఆర్కిటెక్చర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టులున్నాయి. డీటీసీపీ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో వున్నాయి.

మరిన్ని వార్తలు