సూర్యుణ్ని ఫొటో తీయవచ్చా?

14 Sep, 2015 11:43 IST|Sakshi
సూర్యుణ్ని ఫొటో తీయవచ్చా?

కెమెరా చూడగానే ఎవరికైనా సరే ఫొటో తీయాలని లేదా ఫొటో తీయించుకోవాలని కోరిక కలగటం సహజం. అందునా ముఖ్యంగా అందమైన నదీనదాలు, కొండలు, లోయలు, పక్షులు, వన్యప్రాణులు... ఇంకా వినీలాకాశం, మేఘాలు, ఆకాశంలో మారే రంగులు ఇవన్నీ తమ కెమెరాలో బంధించి చక్కటి ఆల్బమ్ రూపొందించాలని చాలామంది భావిస్తుంటారు. అలాగే సూర్యుడిని కూడా ఫొటో తీస్తే బావుంటుందనిపిస్తుంది. కానీ ఇలా చేయటం చాలా ప్రమాదం. ఎందుకంటే కెమెరా ముందు భాగంలో ఉన్న కుంభాకార కటకం మీద పడ్డ సూర్యుని కిరణాలను లోపల ఉన్న కటక వ్యవస్థ గ్రహించి మన కంటి వెనక్కి ప్రసరింపచేస్తుంది.

ఆ తీక్షణమైన కిరణాలు కనుగుడ్డులోకి దూసుకుపోతే దృష్టి దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే బైనాక్యులర్స్, టెలిస్కోప్ లాంటి పరికరాల్లోంచి సూర్యుణ్ని చూడాలి. అంతే తప్ప సాధారణ కెమెరాతో చూడకూడదు. సూర్యుడిని గురించి అధ్యయనం చేసే అంతరిక్ష శాస్త్రజ్ఞులు కూడా సూర్యుడి ప్రతిబింబాన్ని తెర వెనక్కు ప్రసరింపచేసి చూస్తారు. గెలీలియో టెలిస్కోపు ద్వారా నేరుగా సూర్యుడిని చూసి తన కంటి చూపును కోల్పోయాడు. అందుకే సూర్యుడితో జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని వార్తలు