సమగ్ర సమాచారం ఇవ్వరేం

9 Jan, 2017 00:09 IST|Sakshi
సమగ్ర సమాచారం ఇవ్వరేం
  • వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను కోరిన కేంద్రం
  • ఆరు నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
  • లబ్ధిదారుల జాబితాలు అందించని రాష్ట్రం
  •  రెండు రోజుల కిందట ఢిల్లీ నుంచి కేంద్ర ప్రతినిధుల రాక
  • అయినా స్పందించని వివిధ శాఖల కార్యదర్శులు
  • సాక్షి, హైదరాబాద్‌: ఒక్కో కుటుంబం ఎన్ని ప్రభుత్వ పథకాలను అందుకుంటోంది, ఒక్కో ఇంట్లో ఎంత మంది లబ్ధిదారులున్నారు, అని కేంద్రం పక్కాగా లెక్కలు తీస్తోంది. ఎల్‌పీజీ సబ్సిడీ తరహాలో అన్ని పథకాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను నేరుగా లబ్ధిదారులకే చెల్లించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుకుంటున్న లబ్ధిదారుల సమగ్ర సమాచారం పంపాలని ఆరు నెలల కిందటే రాష్ట్రానికి లేఖ రాసింది. అన్ని శాఖల్లో అమల్లో ఉన్న పథకాలను సమ్మిళితం చేయాలని, ఒక్కో లబ్ధిదారు ఎన్ని పథకాలను అందుకుంటున్నారు.. ప్రభుత్వ పరంగా ఏయే ప్రయోజనాలు పొందుతున్నారనే వివరాలు తెలిసేలా సమాచారం పంపాలని నిర్దేశించింది. లబ్ధిదారుల జాబితాలను, వారి ఆధార్‌ కార్డు నంబ ర్లతో సహా పంపాలని కోరింది. ఆరు నెలలు కావ స్తున్నా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల సమాచారాన్ని కేంద్రానికి పంపలేదు.

    పలుమార్లు రిమైండర్లు జారీ చేసినా పట్టించుకోలేదు. దీంతో రెండు రోజుల కిందట కేంద్ర ప్రభుత్వమే తమ ప్రతినిధులను రాష్ట్రానికి పంపింది. సమాచారం పక్కనపెడితే.. కొన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు కనీసం వారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు కూడా నిరాకరిం చటం సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ‘లబ్ధిదారుల జాబి తాలిస్తే అసలు తంతు బయట పడుతుంది. లబ్ధి దారుల ఎంపిక ఎలా జరిగింది, అందులో అర్హులున్నా రా, లేదా, అనేది బట్ట బయలవుతుంది. చేసిన తప్పులు బయటికొస్తాయి. అందుకే సమాచారం ఇచ్చేందుకు కొన్ని శాఖలు వెనకాడుతున్నాయి’ అని బాహాటంగానే చర్చ జరుగుతోంది.

    రూ.36 వేల కోట్ల మిగులు అంచనా..
    వివిధ పథకాలకు ఇస్తున్న సబ్సిడీ నిధులను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసే విధానాలను అమలు చేస్తే.. దేశవ్యాప్తంగా రూ.36 వేల కోట్లు మిగులుతాయని కేంద్రం అంచనా. ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీని కేంద్రం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. దీంతో దాదాపు రూ.28 వేల కోట్లు ఆదా అయినట్లు లెక్కతేలింది. ఈ నెలారంభం నుంచి ఉపాధి హామీ పథకం కూలీలకు కూడా నేరుగా ఖాతాల్లో జమ చేస్తోంది. ఇదే తరహాలో ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యవసాయ శాఖలో అమల్లో ఉన్న విత్తనాలు మొదలు డ్రిప్‌ ఇరిగేషన్‌ వరకు, వృద్ధాప్య పెన్షన్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, ఉపాధి శిక్షణ, అంగన్‌వాడీ, వైద్యారోగ్య శాఖలో అమలవుతున్న వివిధ పథకాలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ నిధులను నేరుగా లబ్ధిదారులకు చెల్లిస్తే భారీ మొత్తం ఆదా అవుతుందని అంచనా. లబ్ధిదారుల సమాచారాన్ని ఒకే చోటకు చేరిస్తే డూప్లికేట్లు, అనర్హులు, అక్రమార్కులకు ముకుతాడు పడుతుందనేది వ్యూహం. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఈ నిధులను ఆదా చేసే అవకాశముందని, వీటిని ఆయా రాష్ట్రాల ఖాతాలకే బదిలీ చేస్తామని కేంద్రం గతంలోనే హామీ ఇచ్చింది.

    ఆధార్‌తోనే అనుసంధానం
    అన్ని విభా గాల డేటాను సమ్మి ళితం చేసేందుకు వీలుగా పథకా లన్నింటినీ ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయిం చింది. రాష్ట్రాలు తమ దగ్గర ఉన్న డేటాను కేంద్రం ఆధ్వ ర్యంలోని ‘సర్వం’ డేటాబేస్‌తో లింక్‌ చేయాలని సూచించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారుల డేటా ఒకేచోటికి చేరుతుంది. ప్రభుత్వం కూడా ఎప్ప టికప్పుడు అవసరమైన సమాచారాన్ని ఈ డేటాబేస్‌ నుంచి రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఆధార్‌ అనుసంధానం ద్వారా ఏ గ్రామంలో.. ఏ కుటుంబం.. ఏయే పథకాల్లో.. ఎంతమేరకు లబ్ధి పొం దిందనే వివరాలను క్షణాల్లోనే తెలుసుకోవటం సాధ్యం అవుతుంది.

మరిన్ని వార్తలు