ఇంతకీ రాఖీ ఎప్పుడు కట్టాలి?

28 Aug, 2015 17:39 IST|Sakshi
ఇంతకీ రాఖీ ఎప్పుడు కట్టాలి?

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమినాడు ఈ పండుగ చేసుకుంటారు. అక్కచెల్లెళ్లు తమ సోదరులు క్షేమంగా ఉండాలంటూ చేతికి రక్షాబంధనం కట్టి, వాళ్లకు హారతులిస్తారు. అయితే.. ఈ శనివారం నాడు అసలు రాఖీ ఏ సమయంలో కట్టాలన్న విషయమై పలు రకాల చర్చలు నడుస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 1.20 గంటల వరకు భద్రకాల దోషం ఉందని, అందువల్ల ఆ తర్వాత మాత్రమే రాఖీ కట్టాలన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్న సెంటిమెంటు. అదికూడా రాత్రి 9.02 వరకు మాత్రమే కట్టాలని చెబుతున్నారు. ఈ రకమైన సందేశాలు వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి.

అయితే.. ఇదంతా ఉత్త ట్రాష్ అని జ్యోతిష్య పండితులు కొట్టేస్తున్నారు. భద్రకాలం అనేది ఓ దోషం మాత్రమేనని, అది ఉన్నంత మాత్రాన రక్షాబంధనం కట్టడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతున్నారు. ఏవైనా పెద్ద పనులు చేపట్టేటప్పుడు, యుద్ధాలకు వెళ్లేటప్పుడు ఈ దోషకాలాన్ని మినహాయించుకుంటే మంచిదేనని, కానీ రక్షాబంధనానికి ఇలాంటివి అడ్డు కాబోవని వివరించారు. దోషకాలంలో కడితే ఏదో అయిపోతుందన్నది ఇటీవలి కాలంలో అనవసరంగా వస్తున్న ఓ చిన్న ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు