బీఎడ్ రెండో దశ కౌన్సెలింగ్ ఎప్పుడు?

7 Dec, 2016 03:21 IST|Sakshi
బీఎడ్ రెండో దశ కౌన్సెలింగ్ ఎప్పుడు?

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
- ఇష్టారాజ్యంగా సీట్లు అమ్ముకుంటున్న యాజమాన్యాలు
- ఆందోళనలో మునిగిపోరుున విద్యార్థులు
 
 సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) రెండో దశ కౌన్సెలింగ్ కోసం విద్యా ర్థులు ఎదురుచూస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభు త్వంగానీ, ఉన్నత విద్యా శాఖగానీ స్పందిం చడం లేదు. రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహిం చాలంటూ పలు కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రరుుంచినా ఫలితం లేదు. కనీసం రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించబోమని అరుునా ప్రకటించకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. మరోవైపు ఇదే అదనుగా చాలా బీఎడ్ కాలేజీల యాజ మాన్యాలు సీట్లను అడ్డగోలుగా అమ్ముకుంటు న్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు.

ప్రభుత్వం ఎలాగూ రెండో  దశ కౌన్సెలింగ్ నిర్వహించడం లేదు కాబట్టి తొలి దశ తరువాత మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల కింద తామే భర్తీ చేసుకునే వీలుందంటూ ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై ఉన్నత విద్యా మండలి కూడా స్పందించడం లేదు. కానీ తాము సీట్లు భర్తీ చేసుకున్నాక.. విద్యార్థుల భవిష్యత్తు కోసమంటూ మండలి ఆ ప్రవేశాలకు ర్యాటిఫికేషన్లు (గుర్తింపు) ఇస్తుందిలే అన్న ధీమాతో బీఎడ్ కాలేజీలు వ్యవహ రిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.

 వేల మంది ఎదురుచూపులు
 2016-17లో బీఎడ్ ప్రవేశాల కోసం గత జూన్‌లో ఎడ్‌సెట్ నిర్వహించగా.. 40,826 మంది అర్హత సాధించారు. సకాలంలో ఫీజుల నిర్ధారణ వెలువడకపోవడంతో ప్రవేశాల ప్రక్రి య ఆలస్యమైంది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించగా.. 21,883 మంది ఆప్షన్లు ఇచ్చు కున్నారు. రాష్ట్రంలోని మొత్తం 184 బీఎడ్ కాలేజీల్లోని 12,532 కన్వీనర్ కోటా సీట్లలో 9,887 సీట్లను కేటారుుంచారు. అరుుతే కోరు కున్న కాలేజీల్లో సీట్లు లభించకపోవడంతో 5,131 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసు కోలేదు. 4,756 మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. ఆ తర్వాత రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఇక అప్పట్లో 11 కొత్త కాలేజీలకు ఎన్‌సీటీఈ అనుమతి రావడంతో.. వాటిని కూడా రెండో దశ కౌన్సెలింగ్‌లో చేర్చి ప్రవేశాలు చేపట్టాలని యాజమాన్యాలు ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశాయి.

మొత్తంగా పాత కాలేజీల్లో మిగిలిన సీట్లు, కొత్త కాలేజీల్లోని సీట్లు కలిపి రెండో దశ కౌన్సెలింగ్‌కు 7,958 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహణను ప్రభుత్వం పక్కనపెట్టేసింది. పెద్ద సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నా కౌన్సెలింగ్ నిర్వహణపై స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. మరోవైపు ఈ పరిస్థితిని బీఎడ్ కాలేజీల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఎలాగూ తమకు ‘స్పాట్’లో భర్తీ చేసుకునే అధికారం ఉందంటూ.. సీట్లను అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు యాజమాన్యాలు భర్తీ చేసుకునే సీట్లకు ర్యాటిఫికేషన్ ఇవ్వాల్సిన విద్యా మండలి కూడా దీనిపై స్పందించడం లేదు. దీంతో కొంత మంది విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించి కాలేజీల్లో చేరుతుండగా.. మరికొంత మంది రెండో దశ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు