రోడ్లు ఊడ్చేవాళ్లే నాకు దేవుళ్లు: సీఎం కేసీఆర్

16 May, 2015 17:15 IST|Sakshi
రోడ్లు ఊడ్చేవాళ్లే నాకు దేవుళ్లు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రోడ్లు ఊడ్చి, శుభ్రం చేసేవారే తనకు దేవుళ్లని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రోడ్లు ఊడ్చేవారిని తక్కువగా చూడవద్దన్నారు. ఈరోజు ఇక్కడ గవర్నర్ నరసింహన్, కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇతర నగరాలకు హైదరాబాద్ స్పూర్తిగా నిలవాలన్నారు. అద్భుతమైన, సుందరమైన నగరాన్ని భావితరాలకు అందిద్దామని పిలుపు ఇచ్చారు. ఐక్యంగా కలసి పనిచేస్తే అద్భుత విజయాలు ఉంటాయని నిరూపిద్దామన్నారు. బస్తీలలో అవసరాలపై ప్రణాళికలు రచిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని గవర్నర్ నరసింహన్ అన్నారు.

మరిన్ని వార్తలు