'అసలు నేనేంటి? ఎందుకిలా చేస్తున్నాను?'

17 Sep, 2016 11:31 IST|Sakshi
'అసలు నేనేంటి? ఎందుకిలా చేస్తున్నాను?'

హైదరాబాద్: 'నేనెందుకు సరిగా చదవలేకపోతున్నాను? నేను ఎందుకు ఇతరులతో కలవలేకపోతున్నాను?' ఈ వ్యాఖ్యలు శనివారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఎన్ ప్రవీణ్ కుమార్ తన నోట్ బుక్ లో రాసుకున్నవి. ఎంఎఫ్ఏ (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఫస్ట్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ శనివారం తెల్లవారు జామున ఎల్ బ్లాక్ రూమ్ నంబర్ 204లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది జులైలోనే ప్రవీణ్ ఎంఎఫ్ఏ కోర్సులో జాయిన్ అయ్యాడు. అతడు ఆత్మహత్య పాల్పడటానికి గలకారణాలేమీ తెలియరాలేదు.

అయితే, అతడి ఉంటున్న గదిలో ఓ ల్యాప్ ట్యాప్, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని నోట్ బుక్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని ఓ నోట్బుక్ లో మాత్రం సెప్టెంబర్ 9నాటి తేదితో ఓ లేఖ మాత్రం దొరికింది. అందులో ప్రవీణ్ స్వయంగా ఇలా రాసుకున్నాడు. 'నాకెందుకు ఇంత భయం వేస్తోంది? నా మీద నాకే కోపం వేస్తోంది. నేను అందరితో ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? నేను ఒంటరివాడిననే భావన ఎందుకు వస్తుంది? నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకే తెలియడం లేదు. ఈ రోజు ఉదయం మా డిపార్ట్మెంట్కు వెళ్లినప్పుడు ఓ విద్యార్థి వచ్చి నన్ను పలకరించాడు. కానీ నేను అతడితో సరిగా మాట్లాడలేకపోయాను.. నేను ఎందుకు ఇలా ఉన్నాను? నేను ఇంకా బాగా చదవాలి. అందుకోసం ఇంకా ఏదో చేయాలి. లేదంటే నా జీవితానికి అర్థం లేదు. నేను ఎందుకసలు సంతోషంగా ఉండలేకపోతున్నాను. నాకు నేనుగా ఒంటరిగా ఎందుకు భావిస్తున్నాను' అంటూ అందులో పేర్కొన్నాడు.

కాగా, ప్రవీణ్ ఆత్మహత్యకు సంబంధించి డీసీపీ కార్తీకేయ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 'నాకెందుకు ఇంత సోమరితనం, భయం' అంటూ ప్రవీణ్ లో నోట్లో రాసి పెట్టుకున్నాడని ఆ కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని చెప్పారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. ప్రవీణ్ కుమార్ ది మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్. అతడి తండ్రి ఓ బీఎస్ఎన్ఎల్ అధికారి.

>
మరిన్ని వార్తలు