సీబీఐతో విచారణ ఎందుకు: యనమల

10 Mar, 2016 03:28 IST|Sakshi
సీబీఐతో విచారణ ఎందుకు: యనమల

సాక్షి, హైదరాబాద్: భూముల ఆరోపణలకు సంబంధించిన రికార్డులు స్పీకరుకు ఇస్తే ఇక్కడే తేల్చొచ్చని, సీబీఐతో విచారణ ఎందుకని ఆర్థిక మంత్రి యనమల ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై కేసులను వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా ఉపసంహరించుకున్నారని చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు.

రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇల్లు తాకట్టులో ఉండేదని, ఇప్పుడు జగన్‌కు అంత ఆస్తి ఎలా వచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్‌ను సైకో అంటూ మంత్రి కామినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు రుజువు చేయాలని, లేకుంటే క్షమాపణ  చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. కాగా, ఐనవోలులో తన కుమార్తె పేరిట 3.57 ఎకరాల భూమి కొన్నానని, ఆ తర్వాత దానిని అమ్మేసి వేరే చోట కొన్నట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల అంగీకరించారు.

మరిన్ని వార్తలు