నిమిషం ఆలస్యమైనా తీసుకోం

2 Feb, 2016 03:32 IST|Sakshi
నిమిషం ఆలస్యమైనా తీసుకోం

‘కానిస్టేబుల్’ దరఖాస్తులపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
 
 సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం ఫిబ్రవరి 4 అర్ధరాత్రి 12 గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. అలాగే దరఖాస్తు కోసం మీసేవా, ఆన్‌లైన్‌లలో డీడీలు తీసి, ఆ తర్వాత తీరిగ్గా ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేస్తామన్నా కుదరదంది. ఒక వేళ డీడీలు తీసి, సబ్‌మిట్ చేయడంలో ఆలస్యం అయితే డబ్బులు తిరిగి చెల్లిం చబడవని రిక్రూట్‌మెంట్‌బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇప్పటి వరకు వచ్చిన మొత్తం 3.78 లక్షల దరఖాస్తుల్లో బీసీ సామాజిక వర్గం నుంచే అత్యధికంగా 1,98,998 అందినట్టు బోర్డు వెల్లడించింది. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం అత్యధికంగా ఎస్టీ అభ్యర్థుల నుంచే దరఖాస్తులు అందాయంది. ఈ జిల్లాలో బీసీల నుంచి 11,304, ఎస్టీల నుంచి 15,978 దరఖాస్తులు వచ్చాయని బోర్డు పేర్కొంది.

మరిన్ని వార్తలు