టెక్నాలజీని విస్తృతంగా వాడతాం

10 Feb, 2016 12:57 IST|Sakshi
టెక్నాలజీని విస్తృతంగా వాడతాం

నగర ప్రణాళిక, అభివృద్ధి, నిర్వహణ కార్యక్రమాల్లో ప్రజలు, పౌర సమాజం భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ మునిసిపల్, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖను చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచడమే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయానికి కారణమని చెప్పారు.

మునిసిపల్ చట్టాలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖలో ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విధానాలన్నింటినీ అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలోని వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పౌరుల సమస్యలను పరిష్కరించేందుకు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తామని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో తామిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు