బీరు ధరకు రెక్కలు

24 Jan, 2018 03:51 IST|Sakshi

కేసు బీరుపై రూ. 45 నుంచి రూ. 60 వరకు పెరిగే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: గత నెలలో మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం తాజాగా బీరుపై దృష్టి పెట్టింది. బీరు ధరలు పెరగబోతున్నాయి. కేసు బీరు మీద కనిష్టంగా రూ.45 నుంచి రూ.60 వరకు పెంచనున్నట్లు సమాచారం. ఇందుకు సాధ్యాసాధ్యాల అ మలుకు ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీకే ధర నిర్ణయ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. పెంచబోతున్న మొత్తంలో పన్నులు పోనూ మిగిలిన సొమ్మును బీరు కంపెనీలకే ఇచ్చేలా కసరత్తులు చేస్తున్నారు. 

ఇందుకేనా?
రాష్ట్రానికి అవసరమైనంత బీరు సరఫరా కోసం ప్రభుత్వం ప్రతి ఏటా బ్రూవరీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. ఇటీవల మద్యం ధరలు పెంచిన నేపథ్యంలో బీరు ధరలు కూడా పెంచాలని బ్రూవరీస్‌ యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఈ విజ్ఞప్తి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. 

ఇక్కడే అధిక వినియోగం
రాష్ట్రంలో ప్రస్తుతం 6 బ్రూవరీ (బీరు ఉత్పత్తి పరి శ్రమలు)ల ద్వారా నెలకు 507.91 లక్షల బల్కు లీటర్ల (బీఎల్‌ఎస్‌) చొప్పున ఏడాదికి 6,096 బీఎల్‌ ఎస్‌ల బీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 5,500 బీఎల్‌ఎస్‌లు రాష్ట్రంలోనే వినియోగమవుతోంది. రోజుకు 8 లక్షల మంది 13 లక్షల సీసాల చొప్పున బీర్లు తాగుతున్నట్లు టీఎస్‌బీసీఎల్‌ నివేదికలు చెబు తున్నాయి. ఈ లెక్కన నెలకు 37.5 లక్షల కేసుల బీర్ల ను మందు బాబులు లాగిస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య 296 లక్షల కేసుల బీర్లు వినియోగ మయ్యాయి. గతేడాది విక్రయాలతో పోలిస్తే ఇది 27% అధికం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి పొరుగు రాష్ట్రాల్లో బీర్ల వినియోగం తెలంగాణలో సగం కూడా లేదు.

మరిన్ని వార్తలు