బాల భీముడు!

24 Jan, 2016 10:14 IST|Sakshi
బాల భీముడు!

మోతీనగర్: పురిటి నొప్పులు రాలేదని 41 వారాలు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్న ఓ గర్భిణి ఎట్టకేలకు శనివారం సాధారణ ప్రసవంలోనే 5.7 కిలోల బరువున్న మగ  శిశువు జన్మనిచ్చింది. పద్మప్రియ ఆసుపత్రిలో శనివారం ఈ అరుదైన ఘటన జరిగిం ది. ఆసుపత్రి గైనకాలజిస్ట్ పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్‌కు చెందిన రేష్మాబేగం ప్రసవ సమయం అయినప్పటికీ నొప్పులు రావడం లేదని 41 వారాల పాటు ఇంట్లోనే ఉండిపోయింది.

సాధారణంగా గర్భిణిలకు 37 నుంచి 39 వారాల మధ్య ప్రసవం అవుతుంది.  41 వారాలైనా పురిటి నొప్పులు రాకపోవడంతో రేష్మాబేగం  శని వారం పద్మప్రియ హాస్పిటల్‌లో చేరింది. వైద్యురాలు పద్మావతి ఆమెకు పరీక్షలు నిర్వహించగా రేష్మా కడుపులో 5.7 కిలోల బరు వు ఉన్న బిడ్డ ఉన్నట్లు తెలిసింది. వెంటనే డెలవరీ కోసం ఏర్పాట్లు చేసి వైద్యురాలు సాధారణ ప్రసవం జరిగేలా చర్యలు తీసుకున్నారు. రేష్మాకు 5.7 కిలోల బరువు ఉన్న బాబు పుట్టాడు.   దీంతో కుటుంబసభ్యులు, ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

>
మరిన్ని వార్తలు